![]() |
![]() |

ఆదివారం విత్ స్టార్ మా పరివారం హోస్ట్ శ్రీముఖి (Sreemukhi) గురించి చెప్పనక్కర్లేదు. ఇక రీసెంట్ షోలో ఒక సోషల్ మీడియాలో వచ్చే రూమర్స్ మీద ఒక ఇంటరెస్టింగ్ సెగ్మెంట్ చేసింది. ఎవరి మీద ఎలాంటి రూమర్స్ వచ్చాయో చెప్పింది, ప్లే చేసి చూపించింది. ఇక ఆమె మీద ఒక రూమర్ లాంటిది వచ్చింది. కానీ అది రూమర్ కాదు . నిజంగానే శ్రీముఖి ఫుడ్ బిజినెస్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన విషయం అది.
"ఎప్పుడూ నా మీద పాత రూమర్స్ రాస్తారు. ఇంకా ఏదైనా కొత్తగా రూమర్స్ క్రియేట్ చేయండి. ఈసారి ఒక గుడ్ న్యూస్ చెప్తున్నా శ్రీముఖి అని ఉంటది ఆ గుడ్ న్యూస్ ఏమీ ఉండదు. ప్రముఖ బిజినెస్ మ్యాన్ ని పెళ్లి చేసుకోబోతున్న శ్రీముఖి అని ఉంటుంది. ఆ బిజినెస్ మ్యాన్ ఎవరో చెప్తే నేనే కదా వెళ్లి ముందు మాట్లాడతాను" అంది శ్రీముఖి.
ఇక అవినాష్ ఐతే అమ్మగారు మీ గురించి ఒక రూమర్ వచ్చింది. "ఆదివారం విత్ స్టార్ మా పరివారం రెమ్యూనరేషన్ తో రెస్టారెంట్ ఓపెన్ చేసిన శ్రీముఖి" అనే రూమర్ ని చూపించారు. "నిజంగా నేను గర్వంగా చెప్పుకుంటుంటున్నా ఆదివారం పరివారం షో మూడున్నరేళ్ల నుంచి సాగుతుంది కాబట్టి ఎంతో కొంత కూడబెట్టి " అని శ్రీముఖి అనేసరికి "ఎంతో కొంత ఏంటి చాలా " అంటూ హరి అసలు విషయం చెప్పాడు. "ఆ కూడబెట్టిన డబ్బుతో ఒక పార్ట్ ఆఫ్ ది రెస్టారెంట్ పెట్టాను." అంది. చిన్నది కాదు ఒక నాలుగు ఎకరాల్లో " అన్నాడు హరి. "అమ్మగారు ఒక మాట చెప్పండి అసలు ఎంత సంపాదించారు " అని అవినాష్ అడిగాడు కానీ శ్రీముఖి ఆన్సర్ చెప్పలేదు. ఐతే రీసెంట్ గా శ్రీముఖి ముగ్గురు పార్టనర్స్ తో కలిసి గత నెల్లో "ఫుర్సత్" అనే రెస్టారెంట్ ని ఓపెన్ చేసిన తెలిసిందే.
![]() |
![]() |